Search
Close this search box.

  ఏఐ వేధింపులపై శ్రీలీల ఆవేదన: “చేతులు జోడించి వేడుకుంటున్నా.. అలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించకండి”

December 17, 2025 7:28 PM | Aditya369 News

ఏఐ వేధింపులపై శ్రీలీల ఆవేదన: “చేతులు జోడించి వేడుకుంటున్నా.. అలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించకండి”

సినీ నటి శ్రీలీల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టిస్తున్న అభ్యంతరకరమైన కంటెంట్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు. టెక్నాలజీని జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగించాలి కానీ, ఇలా ఇబ్బందుల్లోకి నెట్టడానికి కాదని ఆమె హితవు పలికారు. ఏఐని ఉపయోగించి సృష్టిస్తున్న అర్థరహితమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని ఆమె సోషల్ మీడియా వినియోగదారులందరినీ చేతులు జోడించి వేడుకున్నారు.
కళను వృత్తిగా ఎంచుకున్నా సరే, ప్రతి అమ్మాయి ఒకరి కూతురో, సోదరో లేదా స్నేహితురాలో అన్న విషయాన్ని మర్చిపోవద్దని శ్రీలీల విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమలో రక్షణ ఉంటుందన్న నమ్మకంతో తాము పని చేస్తున్నామని, అయితే గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. కేవలం తాను మాత్రమే కాకుండా, తన తోటి నటీమణులు కూడా ఇలాంటి వేధింపులకే గురవుతున్నారని, వారందరి తరపున తాను మాట్లాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు.
ఈ కఠిన సమయంలో అభిమానులు, ప్రేక్షకులు తమకు అండగా నిలబడతారని శ్రీలీల ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ వేధింపులకు సంబంధించి ఇప్పటికే అధికారులు చర్యలు చేపడుతున్నారని ఆమె తన ప్రకటనలో వెల్లడించారు. తోటి మహిళా నటీమణుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, టెక్నాలజీని వేధించడానికి ఆయుధంగా మార్చుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు