దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాకు హీరోయిన్ ఎవరు అన్న విషయంపై చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొదట సాయిపల్లవి పేరు వినిపించగా, ఆ తర్వాత కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రేసులో మమిత బైజు పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమెనే దాదాపు ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
ఈ చిత్రంతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు జోడీగా కొత్త ఫేస్ కావాలనుకున్న మేకర్స్, చివరికి మమిత వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. ఈ కాంబినేషన్ కుదిరితే తెరపై ఒక ఫ్రెష్ పెయిర్ కనిపించనుండటంతో సినిమాకు మంచి బజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
‘ప్రేమలు’, ‘డ్యూడ్’ వంటి సినిమాలతో మమిత తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే ధనుష్ నటించిన ‘కర్’ మూవీలోనూ ఆమె నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘సెల్లీ’ అనే మధ్యతరగతి అమ్మాయి పాత్రలో సహజమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత మమితపై పెద్ద బ్యానర్ల దృష్టి పడిందని, అదే ఇప్పుడు ‘ఎల్లమ్మ’ సినిమాలో ఛాన్స్ వచ్చేలా చేసిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ సరసన మమిత బైజునే హీరోయిన్‌గా ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గాసిప్స్ జోరుగా సాగుతున్నాయి.








