టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్-ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో ఇతర భాషల ప్రముఖ నటులు కూడా చేరుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌లో కనిపించినట్టు తెలుస్తోంది. ఆయన ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారని ఇండస్ట్రీ టాక్.
అనిల్ కపూర్ – ఎన్టీఆర్ సినిమాలో విలన్?
ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం అనిల్ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకూ దీనిపై స్పష్టత రావడం లేదు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా రుక్మిణి వసంత్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ ఉపయోగిస్తున్నారు.
డ్రాగన్ కాదా అసలు టైటిల్?
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి తెలిపిన వివరాల ప్రకారం, డ్రాగన్ ఫైనల్ టైటిల్ కాదు. మేకర్స్ త్వరలోనే ఒక గ్రాండ్ ఈవెంట్‌లో అసలు టైటిల్‌ను ప్రకటించబోతున్నారు.
ఎన్టీఆర్ ఇటీవల నటించిన వార్ 2 ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వకపోయినా, ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి, అయితే దీనిపై అధికారిక నిర్ధారణ ఇంకా లేదు.
యాక్షన్ – అడ్వెంచర్ విజువల్ స్పెక్టకుల్
కేజీఎఫ్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, తరువాత ప్రభాస్‌తో చేసిన సలార్తో మరో హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్‌తో చేస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా మీద భారీ హైప్ నెలకొంది.
ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రబృందం షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఎన్టీఆర్ కూడా RRR తో గ్లోబల్ రేంజ్‌లో పేరు తెచ్చుకుని, దేవరతో మరో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు..









