పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ అభిమానుల కోసం ప్రత్యేక గిఫ్ట్‌ను అందించింది. స్టైలిష్ పోస్టర్ రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, సూపర్‌హిట్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్–హరీష్ కాంబినేషన్‌లో రాబోతోంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ శనివారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్‌పై ఓ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌ను చిత్రీకరిస్తూ ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మాస్ బీట్‌లు అందించగా, దినేష్ మాస్టర్ శక్తివంతమైన కొరియోగ్రఫీని రూపొందిస్తున్నారు.
ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా ప్యూర్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాను తీర్చిదిద్దాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది..









