Search
Close this search box.

  ఇరిగేషన్ శాఖలో అవినీతి తిమింగలం.. 25 చోట్ల సోదాలు..150 కోట్ల అక్రమాస్తులు..

November 30, 2024 7:53 PM | Aditya369 News

ఇరిగేషన్ శాఖలో అవినీతి తిమింగలం.. 25 చోట్ల సోదాలు..150 కోట్ల అక్రమాస్తులు..

ఓ నీటి పారుదల శాఖ ఏఈఈ అక్రమాస్తులు రూ.150 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీబీఈఎల్ సిటీ అపార్ట్‌మెంట్‌లోని నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ ఆధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

నిఖేశ్ కుమార్ ఇంటితో పాటు అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. మొత్తం 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతనికి ఫాంహౌస్, వ్యవసాయ భూములు, భవనాలు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. కేజీల కొద్ది బంగారం కూడా గుర్తించారు. ఇప్పటి వరకు అతని ఆస్తుల విలువ రూ.150 కోట్లుగా ఉన్నట్లు గుర్తించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు