ధురంధర్ ది రివెంజ్’అంటూ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని ఊచకోత కోస్తు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు ఆదిత్య ధర్ .దీంతో ఈ క్రేజీ ఫిలిమ్ మేకర్ తర్వాతి సినిమా ఎప్పుడు ఎవరితో చేయబోతున్నాడన్న క్యూరియాసిటీ అందరిలో పెరిగిపోయింది.అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆదిత్య ధర్ మాత్రం ఇండియన్ సినిమానే షేక్ చేసేలా ఓ ‘మెగా మల్టీస్టారర్’కు స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. అవును.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్య ఈ ఇద్దరినీ ఒకే స్క్రీన్‌పైకి తీసుకురాబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీనే షేక్ చేస్తుంది.
ప్రభాస్-సూర్య కాంబినేషన్ అంటే, అది అశ్వత్థామ కోసమేనా?
ప్రభాస్‌కు ఉన్న వరల్డ్ వైడ్ హ్యూజ్ ఫాలోయింగ్, సూర్య మెస్మరైజ్ ఫర్ఫామెన్స్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విధ్వంసం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కూడా. ఇక ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ‘హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్’ అని, ఇందులో ఇద్దరు హీరోల మధ్య వచ్చే మైండ్ గేమ్స్ ,యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని బాలీవుడ్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్. అయితే ఈ వార్త ఇలా స్ప్రెడ్ అయిందో లేదో మూవీ లవర్స్ లో ఓ పెద్ద కన్ఫ్యూజన్ తో పాటు చిన్న ఎగ్జైట్‌మెంట్ మొదలైంది. కారణం ఏంటంటారా .. ఆదిత్య ధర్ గత కొంతకాలంగా చెక్కుతున్న ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ (The Immortal Ashwatthama). భారతీయ పురాణాల ఆధారంగా రూపొందాల్సిన ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ ప్రాజెక్ట్ బడ్జెట్ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెల్సిందే. మరి ప్రభాస్-సూర్య కాంబినేషన్ అంటే, అది అశ్వత్థామ కోసమేనా? లేక ఆదిత్య ధర్ మరేదైనా సరికొత్త వరల్డ్ ని క్రియేట్ చేయబోతున్నాడా? అన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీ.
రామ్ చరణ్‌తో ఉండే ప్రాజెక్ట్ ఏమైంది?
నిజానికి అశ్వత్థామ వంటి అమరత్వం ఉన్న పాత్రకు ప్రభాస్ కటౌట్ కాక మరెవరు సూట్ అవుతారు.ఇక ప్రభాస్ కి తోడు సూర్య లాంటి వెర్సటైల్ స్టార్ కలిస్తే ఆ సినిమా రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్ళడం పక్కా. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కూడా ఆదిత్య ధర్ ఒక భారీ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరిపారనే ప్రచారం గతంలోనే గట్టిగానే సర్క్యులేట్ అయింది. దీంతో ఆదిత్య ధర్ అసలు ఎవరితో సెట్స్ పైకి వెళ్తారు? రామ్ చరణ్‌తో ఉండే ప్రాజెక్ట్ ఏమైంది? అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయ్.
హి ఈజ్ ది మోస్ట్ బిజియెస్ట్ హీరో ఇన్ ది ఇండియా
అయితే ప్రభాస్ లైనప్ ఇపుడు వరుస సినిమాలతో ఫుల్ ఫ్యాక్ అయిన సంగతి తెల్సిందే. ఒకరకంగా చెప్పాలంటే ‘హి ఈజ్ ది మోస్ట్ బిజియెస్ట్ హీరో ఇన్ ది ఇండియా’ అని చెప్పాలి. మరి ఇంత బిజీగా ఉన్న ప్రభాస్ ఆదిత్య ధర్ స్క్రిప్ట్‌కు ఓకే అన్నారంటే కథలో ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ ఉండే ఉండాలని , అందువల్లే గ్యాప్ కుదుర్చుకొని మరీ అధిత్య సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ అప్పడే డిబేట్లు పెట్టేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. ఇక దేశ విదేశాల్లోని అత్యంత ఖరీదైన లొకేషన్లలో ఈ సినిమాను షూట్ చేస్టారని, అందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా రంగంలోకి దించాలని ఆదిత్య ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ప్రభాస్, సూర్య, ఆదిత్య ధర్ కాంబో సెట్ అయితే మాత్రం
ఏది ఏమైనా ఇద్దరు స్టార్ల ఇమేజ్ దెబ్బతినకుండా, ఎవరి పాత్ర తక్కువ కాకుండా స్క్రీన్‌ప్లేను డిజైన్ చేశాడంటే అధిత్య ధర్ ని మెచ్చుకోవాల్సిందే. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ రానప్పటికీ, సోషల్ మీడియాలో జరుగుతున్నడిబేట్లు చూస్తుంటే ఇది కేవలం పుకారు మాత్రమే కాదని, లోపల ఏదో పెద్దదే జరుగుతోందని స్పష్టమవుతోంది.ఏది ఏమైనా ప్రభాస్, సూర్య, ఆదిత్య ధర్ కాంబో సెట్ అయితే మాత్రం, అది ఇండియన్ సినిమా చరిత్రని తిరగరాస్తుందన్నది నిజం.









