Search
Close this search box.

  ఇండియన్ స్క్రీన్‌పై కొత్త బెంచ్‌మార్క్ తారక్ “డ్రాగన్”..

April 8, 2026 11:45 PM | Aditya369 News

ఇండియన్ స్క్రీన్‌పై కొత్త బెంచ్‌మార్క్ తారక్ “డ్రాగన్”..

“డ్రాగన్” సినిమా ఆగిపోయిందని, స్క్రిప్ట్ నచ్చక తారక్ షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చాడంటూ వచ్చిన రూమర్స్‌కి చివరికి క్లారిటీ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ స్పందిస్తూ… సినిమా ఎక్కడా ఆగలేదని, భారీ బడ్జెట్‌తో హై స్టాండర్డ్స్‌లో ప్లాన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఫారిన్ లొకేషన్స్ కోసం జరుగుతున్న ప్రిపరేషన్ కారణంగానే షూటింగ్‌లో చిన్న గ్యాప్ వచ్చిందని తెలిపారు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే హై వోల్టేజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ అన్న విషయం తెలిసిందే. అలాంటి సినిమాలకు మధ్యలో గ్యాప్ తీసుకుని క్వాలిటీపై ఫోకస్ పెట్టడం కొత్తేమీ కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. KGF, సలార్ సినిమాల సమయంలో కూడా ఇదే విధానం అనుసరించి… చివరికి హై స్టాండర్డ్స్ అవుట్‌పుట్ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు.

ఈసారి కూడా “డ్రాగన్” సినిమాను టెక్నికల్‌గా ఇండియన్ స్క్రీన్‌పై ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిపేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎక్కువగా డార్క్ థీమ్ కనిపించేది. కోల్ మైన్స్, క్రైమ్ వరల్డ్, అండర్‌వర్డ్ బ్యాక్‌డ్రాప్‌లతో ఆయన సినిమాలు హెవీ టోన్‌లో ఉండేవి.

కానీ ఈసారి మాత్రం అదే ఫార్ములాను రిపీట్ చేయకుండా… పూర్తిగా కొత్త విజువల్ లాంగ్వేజ్‌ను ట్రై చేస్తున్నారట. న్యాచురల్ లైటింగ్, భారీ ల్యాండ్‌స్కేప్స్, రియలిస్టిక్ యాక్షన్‌తో హాలీవుడ్ స్టైల్‌లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా కోసం Jr. NTR కూడా ఫిజికల్‌గా భారీగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాడని సమాచారం. ముఖ్యంగా కేరళకు చెందిన పురాతన యుద్ధకళ “కలరిపయట్టు”లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. ఇది కేవలం పబ్లిసిటీ కోసం కాకుండా… సినిమాలో దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం చేస్తున్న ప్రిపరేషన్ అని తెలుస్తోంది.

ఈ ఫైట్‌లో తారక్ బాడీ లాంగ్వేజ్, స్పీడ్, ఫ్లెక్సిబిలిటీ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని… లాంగ్ టేక్స్, రియల్ స్టంట్స్, మినిమమ్ VFX‌తో ఈ సీన్‌ను డిజైన్ చేస్తున్నారట.

ఇక మేకర్స్ నుంచి సరైన అప్‌డేట్స్ రాకపోవడంతో… తారక్ ఫ్యాన్స్ తమ క్రియేటివిటీని బయటకు తీస్తున్నారు. AI టెక్నాలజీతో తారక్ కలరిపయట్టు నేర్చుకుంటున్న ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు అయితే ఈ ఫోటోలే అసలు కంటే బెటర్‌గా ఉన్నాయంటూ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూర్తిగా విలన్‌గా కాకుండా… గ్రే షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారట. ముఖ్యంగా తారక్ – అనిల్ కపూర్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.

ఇక షూటింగ్ లొకేషన్స్ విషయానికి వస్తే… జోర్డాన్, ఆఫ్రికా ప్రాంతాల్లో కీలక యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారట. భారీ డెజర్ట్ ల్యాండ్‌స్కేప్స్, వైడ్ విజువల్స్, రియలిస్టిక్ యాక్షన్ కోసం ఈ లొకేషన్స్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ OTT సంస్థ Netflix భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు ₹125 కోట్లకు పైగా ఈ డీల్ జరిగిందని ప్రచారం జరుగుతోంది.

మరి ఇక మేకర్స్ నుంచి సాలిడ్ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. లేకపోతే ఫ్యాన్స్ క్రియేటివిటీనే కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు