సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో పెళ్లి శుభవార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. 2026 సంవత్సరం మొదలైనప్పటి నుంచి పలువురు సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెడుతూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అలాగే అల్లు శిరీష్ కూడా వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా కావ్య రెడ్డి అనే యువతితో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ వరుస పెళ్లిళ్లతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మే నెలలో అనుపమ ఎంగేజ్మెంట్?
ఇలాంటి పరిస్థితుల్లో మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ప్రేమమ్’ సినిమా ద్వారా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో బిజీగా ఉంది. అయితే మే నెలలోనే ఎంగేజ్మెంట్ జరగనుందని, తేదీ కూడా ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది.
ఇండస్ట్రీ వ్యక్తితోనే పెళ్లి?
అనుపమ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే ఆమె వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఇది ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చిన మ్యారేజా అన్నది ఇంకా క్లారిటీ లేదు. గతంలో కూడా అనుపమ పెళ్లి, రిలేషన్‌షిప్ గురించి అనేక వార్తలు వచ్చినప్పటికీ, ఆమె ఎప్పుడూ స్పందించలేదు.
ధృవ్ విక్రమ్‌తో రిలేషన్?
ఇటీవల అనుపమ పరమేశ్వరన్, హీరో ధృవ్ విక్రమ్ మధ్య రిలేషన్ ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకరి పోస్టులకు ఒకరు లైక్స్ కొట్టడం, ఒకే లొకేషన్లలో వేరువేరు ఫోటోలు షేర్ చేయడం వంటి విషయాలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. అయితే ఈ వార్తలపై ఇద్దరూ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ‘బైసన్’ సినిమా సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని కూడా టాక్ వినిపిస్తోంది.









