అక్కినేని ఫ్యామిలీ లాంటి సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అఖిల్ అక్కినేని ఇప్పటివరకు చేసిన సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయి. ‘అఖిల్’ (2015), ‘హలో’ (2017), ‘మిస్టర్ మజ్ను’ (2019), ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ (2021), ‘ఏజెంట్’ (2023) వంటి చిత్రాలు చేసినప్పటికీ, ఆయనకు ఒక స్ట్రాంగ్ హిట్ మాత్రం దక్కలేదు.
ఇప్పుడు మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో తన ఆరవ చిత్రంగా ‘లెనిన్’ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమా మీద మాత్రం కొంత పాజిటివ్ బజ్ కనిపిస్తోంది.
అఖిల్ – మారుతి కాంబోలో సినిమా?
ఇదిలా ఉంటే, టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న ఓ క్రేజీ న్యూస్ అక్కినేని అభిమానుల్లో కలకలం రేపుతోంది. అదే మారుతి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందన్న వార్త.
మారుతి గతంలో ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ వంటి చిన్న సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. అయితే స్టార్ హీరోలతో మాత్రం అదే మ్యాజిక్ చూపించలేకపోయాడు. ముఖ్యంగా Prabhas తో చేసిన ‘ది రాజాసాబ్’ భారీ నిరాశగా మారి ట్రోల్స్‌కు గురైంది.
ఫ్యాన్స్ టెన్షన్…
ఇప్పటికే హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ పరిస్థితి చూస్తే, ఈ టైంలో మారుతితో సినిమా అన్న వార్త ఫ్యాన్స్‌ను టెన్షన్‌కు గురిచేస్తోంది. “ఇప్పటికే కెరీర్ డెలికేట్ స్టేజ్‌లో ఉంది… ఈ టైంలో రిస్క్ వద్దు” అంటూ ఓపెన్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో నాగ చైతన్య తో మారుతి తెరకెక్కించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ కమర్షియల్‌గా యావరేజ్ అయినా, అభిమానులకు మాత్రం పెద్దగా నచ్చలేదు. దీంతో మారుతి స్టైల్ కామెడీ అక్కినేని హీరోల ఇమేజ్‌కి సెట్ కావడం కష్టమనే అభిప్రాయం బలపడింది.
స్టోరీ లైన్ నచ్చిందా?
అయితే, అఖిల్ – మారుతి మధ్య ఇప్పటికే కొన్ని సార్లు చర్చలు జరిగాయని, మారుతి చెప్పిన స్టోరీ లైన్ అఖిల్‌కు నచ్చిందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
కెరీర్ డిసైడింగ్ స్టేజ్…
ప్రస్తుతం అఖిల్ కెరీర్ ఒక కీలక దశలో ఉంది. ‘లెనిన్’ హిట్ అయితే అతని కెరీర్ కొత్త టర్న్ తీసుకునే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో మరోసారి ఫెయిల్ అయితే కోలుకోవడం కష్టమే.
ఇప్పుడు చూడాలి… ఈ అఖిల్ – మారుతి కాంబో నిజంగా సెట్స్‌పైకి వెళ్తుందా? లేక ఫ్యాన్స్ రియాక్షన్ చూసి వెనక్కి తగ్గుతారా?









