Search
Close this search box.

  ‘అఖండ 2’ లాజిక్‌పై విమర్శలు: ట్రోలర్స్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను

December 16, 2025 5:54 PM | Aditya369 News

‘అఖండ 2’ లాజిక్‌పై విమర్శలు: ట్రోలర్స్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను

నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ 2' డిసెంబర్ 12న విడుదలైంది. సినిమాకు మంచి స్పందన లభిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు కొన్ని సన్నివేశాలు లాజిక్స్‌కు అతీతంగా ఉన్నాయంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా మీడియాతో మాట్లాడుతూ ట్రోలర్స్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
సినిమాలో లాజిక్ లేదన్న ఆరోపణలను బోయపాటి పూర్తిగా ఖండించారు. తాను కథను రాసుకునేటప్పుడు ప్రతి అంశాన్ని లాజిక్‌కు లోబడే డిజైన్ చేశానని తెలిపారు. అయితే, విమర్శలు చేసేవారు సినిమాలోని నేపథ్యాన్ని, చెప్పాలనుకున్న కాన్సెప్ట్‌ను పూర్తిగా అర్థం చేసుకోకుండానే మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎక్కడా నిర్లక్ష్యంగా కథను రాయలేదని, ప్రతి సన్నివేశానికి కచ్చితంగా ఓ కారణం ఉంటుందని స్పష్టం చేశారు.
ముఖ్యంగా, అఖండ పాత్రకు సంబంధించిన అష్టసిద్ధి అంశంపై బోయపాటి వివరణ ఇచ్చారు. అష్టసిద్ధి సాధన అనేది కొన్ని రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని, దానికి దాదాపు 14 నుంచి 16 ఏళ్ల పాటు కఠినమైన సాధన అవసరమవుతుందని చెప్పారు. సినిమాలో కూడా అఖండ ఆ సాధన పూర్తి చేసుకున్న తర్వాతే అతడి స్పర్శకు అసాధారణమైన పరిణామాలు జరుగుతాయనే సంకేతాలను ముందుగానే ఇచ్చామని, ఈ పాయింట్‌ను గమనించకుండా ట్రోలింగ్ చేయడం సరైన విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ డిసెంబర్ 12న విడుదలైంది. సినిమాకు మంచి స్పందన లభిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు కొన్ని సన్నివేశాలు లాజిక్స్‌కు అతీతంగా ఉన్నాయంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా మీడియాతో మాట్లాడుతూ ట్రోలర్స్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

సినిమాలో లాజిక్ లేదన్న ఆరోపణలను బోయపాటి పూర్తిగా ఖండించారు. తాను కథను రాసుకునేటప్పుడు ప్రతి అంశాన్ని లాజిక్‌కు లోబడే డిజైన్ చేశానని తెలిపారు. అయితే, విమర్శలు చేసేవారు సినిమాలోని నేపథ్యాన్ని, చెప్పాలనుకున్న కాన్సెప్ట్‌ను పూర్తిగా అర్థం చేసుకోకుండానే మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎక్కడా నిర్లక్ష్యంగా కథను రాయలేదని, ప్రతి సన్నివేశానికి కచ్చితంగా ఓ కారణం ఉంటుందని స్పష్టం చేశారు.

ముఖ్యంగా, అఖండ పాత్రకు సంబంధించిన అష్టసిద్ధి అంశంపై బోయపాటి వివరణ ఇచ్చారు. అష్టసిద్ధి సాధన అనేది కొన్ని రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని, దానికి దాదాపు 14 నుంచి 16 ఏళ్ల పాటు కఠినమైన సాధన అవసరమవుతుందని చెప్పారు. సినిమాలో కూడా అఖండ ఆ సాధన పూర్తి చేసుకున్న తర్వాతే అతడి స్పర్శకు అసాధారణమైన పరిణామాలు జరుగుతాయనే సంకేతాలను ముందుగానే ఇచ్చామని, ఈ పాయింట్‌ను గమనించకుండా ట్రోలింగ్ చేయడం సరైన విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు