Search
Close this search box.

  హైదరాబాద్ లో కల్తీ మాఫియా..! యాసిడ్ తో పాల తయారీ..,!

October 18, 2024 7:34 PM | Aditya369 News

హైదరాబాద్ లో కల్తీ మాఫియా..! యాసిడ్ తో పాల తయారీ..,!

హైదరాబాద్ లో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. అక్రమ సంపాదనే ధ్యేయంగా వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో కల్తీపాలను తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. మేడిపల్లిలో నకిలీ పాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో.. పాల తయారీ కేంద్రంపై మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు దాడులు జరిపారు. పౌడర్‌తో నకిలీ పాలు తయారు చేస్తున్న గజేందర్ సింగ్‌ రాజ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల చేసిన తనిఖీల్లో..300 కేజీల పన్నీరు, 4 వేల 500 లీటర్ల రిఫైండ్ ఆయిల్, 750 లీటర్ల అసిటిక్ యాసిడ్‌, 15 లీటర్ల గ్లూకోజ్‌ లిక్విడ్‌ను సీజ్ చేసారు. దాంతో పాటు 16 వేల 250 కేజీల స్కీమ్డ్‌ మిల్క్‌ పౌడర్‌ను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గజేందర్ పై కేసు నమోదు చేసి పీఎస్‌కు తరలించారు. పీర్జాదిగూడా ప్రాంతంలోనే కాకుండా బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ పాలు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.

ఇదిలా ఉంటే మరోవైపు.. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి చికెన్ సెంటర్లు. కుళ్లి పోయిన చికెన్‌ యధేచ్చగా అమ్మేస్తున్నాయి. సికింద్రాబాద్ బేగంపేట్ ప్రకాష్ నగర్‌లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సోదాల్లో భయంకరమైన విషయాలు బయటకొచ్చాయి. బాలయ్య చికెన్ సెంటర్‌లో కుళ్లిన కోడి మాంసం బయటపడింది. కోడి ఎముకలకు కెమికల్స్ కలిపి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు.. జనతా బార్లకు అమ్మేస్తున్నారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల కలిసి ఆకస్మిక తనిఖీలు చేశాయి. బాలయ్య చికెన్ సెంటర్ లో తనిఖీలు నిర్వహించగా కుళ్ళిన కోడి మాంసంంతోపాటు కొవ్వు పదార్థాలు దొరికాయి. ఏడు క్వింటాళ్ల కుళ్ళిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాలయ్య చికెన్ సెంటర్‌కు తాళాలు వేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు