పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit Movie), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ను తొలిసారిగా పోలీస్ యూనిఫామ్‌లో చూపించనున్నారు. అయితే, ఈ లుక్ విషయంలో దర్శకుడు అత్యంత గోప్యత పాటిస్తుండగా, ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
తాజా సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమాలోని ప్రభాస్ పాత్ర లుక్‌ను అభిమానులకు సర్ప్రైజ్గా ఉంచాలని సందీప్ వంగా గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే, ఆ లుక్ ఏ మాత్రం లీక్ కాకుండా ఉండేందుకు, రాబోయే ఆరు నెలల పాటు ప్రభాస్‌ను పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉండాలని ఆయన కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బహిరంగ కార్యక్రమాలు, ఎయిర్‌పోర్ట్‌లలో ప్రభాస్ కనిపిస్తే, ఆయన లుక్‌ను అభిమానులు లేదా మీడియా ఫోటోలు తీసే అవకాశం ఉంది.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, కొన్ని నెలల పాటు ఎలాంటి ప్రచార కార్యకలాపాలు లేదా బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాకూడదని ప్రభాస్, సందీప్ వంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అభిమానులను కొంత నిరాశపరిచినా, దర్శకుడు సందీప్ వంగా ప్రభాస్‌ను ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారో చూడాలనే ఉత్సాహం మాత్రం ఫ్యాన్స్‌లో మరింత పెరిగింది.









