టాలీవుడ్ స్టార్ దర్శకుడు S.S రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరో నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీ రాజ్ సుకుమారన్ కు సంబంధించిన భాగం ఇప్పటికే పూర్తయింది. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
రాముడిగా మహేష్ బాబు…
ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో బిగ్ అప్డేట్ త్వరలోనే రానుందని టాక్. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సూపర్ స్టార్ మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించబోతున్న లుక్ను మే 31న, కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేసే ప్లాన్లో ఉన్నారట. ‘వారణాసి’ సినిమాలో దాదాపు అరగంట పాటు మైథాలజీ ఎపిసోడ్ ఉండబోతుందని, అందులో మహేష్ బాబు రాముడిగా దర్శనమిస్తారని సమాచారం.
కృష్ణ జయంతి సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్…
ఇప్పటికే మహేష్ బాబు రాముడి లుక్కు సంబంధించిన కొన్ని రిఫరెన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు అధికారిక లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ లుక్ను ఇప్పుడే రిలీజ్ చేస్తే ఆ థ్రిల్ తగ్గిపోతుందని, థియేటర్లోనే చూపిస్తే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని టీమ్ భావించినట్టు తెలుస్తోంది. కానీ ఇటీవల లీకేజీలు ఎక్కువవుతున్న నేపథ్యంలో, ముందుగానే విడుదల చేయాలనే ఆలోచనలో S.S రాజమౌళి ఉన్నారని టాక్.
గ్లోబల్ స్థాయిలో ‘వారణాసి’…
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రకాశ్ రాజ్, వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని S. S. కార్తికేయా మరియు K. L. నారాయణ నిర్మిస్తుండగా, సంగీతాన్ని M. M. కీరవాణి అందిస్తున్నారు.
మొత్తానికి, ‘వారణాసి’ నుంచి వచ్చే తదుపరి అప్డేట్పై అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది.








