Search
Close this search box.

  లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్..?

November 29, 2025 9:28 AM | Aditya369 News

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్..?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించిన లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారంతో తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన అన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో శాతం శాతం విజయం సాధించాయి. అపజయం అనే మాట ఆయన కెరీర్‌లో కనిపించకపోవడంతో, ఆయన తదుపరి సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమిళ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన లోకేష్ త్వరలోనే తొలి తెలుగు చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వివిధ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. లోకేష్ కనగరాజ్ టాలీవుడ్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నారనే వార్తలు తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో హాట్ టాపిక్‌గా మారాయి. లోకేష్ అల్లు అర్జున్‌కు ఒక కథను వినిపించగా, ఆ కథ బన్నీకి బాగా నచ్చిందని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారని సమాచారం అందుతోంది.

ఈ చిత్రానికి సంగీతం అందించేది అనిరుధ్ రవిచందర్ అనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. సినిమా షూటింగ్ 2026 చివరి నాటికి ప్రారంభం కావొచ్చని ఇండస్ట్రీ టాక్. అల్లు అర్జున్ నుంచి అంగీకారం రావడంతో లోకేష్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం విషయాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతూ, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని తెలిసింది. ఈ చిత్రాన్ని ముగించిన వెంటనే అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌లో పూర్తిగా బిజీ కానున్నారని సమాచారం. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని అంచనా. అదే ఏడాదిలో పుష్ప 3 కోసం కూడా అల్లు అర్జున్ టైమ్ కేటాయించనున్నారని తెలుస్తోంది.

వరుసగా పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్టులు లైన్లో ఉండటంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చివరగా పుష్ప 2 ద్వారా భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.?

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు