పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్… ఆ తర్వాత వచ్చిన పుష్ప 2తో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. ఈ రెండు సినిమాలతో నేషనల్ అవార్డు దక్కించుకుని కొత్త రికార్డులు సృష్టించిన బన్నీ… ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో తన తదుపరి సినిమాతో రెడీ అవుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన రోజు నుంచే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ ముందుగానే లీక్ అవడం కామన్. కానీ ఈసారి అట్లీ – బన్నీ కాంబినేషన్ మాత్రం ఎక్కడా చిన్న క్లూ కూడా ఇవ్వకుండా సీక్రెట్‌గా ఉంచింది. చివరికి ఎవరూ ఊహించని విధంగా “రాకా (Raaka)” అనే పవర్ఫుల్ టైటిల్‌తో అందరినీ సర్ప్రైజ్ చేసింది.
“రాకా” అనే టైటిల్ వినగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇలాంటి టైటిల్ ఎప్పుడూ ఊహించలేదని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు. టైటిల్ రివీల్ తర్వాత సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ – అసలు ఈ పేరుకి అర్థం ఏమిటి? కథతో దీనికి సంబంధం ఏంటి? అనే ప్రశ్నలే.
ఇప్పటి సమాచారం ప్రకారం “రాకా” అనే పదం “రాక్షసుడు”, “రాకాసి” వంటి పదాల నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. అంటే మనిషిలోని క్రూరత్వం, విధ్వంసకర స్వభావాన్ని సూచించేలా ఈ టైటిల్‌ను రూపొందించినట్టు అర్థమవుతోంది.
ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే… టైటిల్‌కు తగ్గట్టుగానే బన్నీ లుక్ కూడా చాలా రగ్గడ్‌గా, భయంకరంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో, విలన్ ఇద్దరూ అల్లు అర్జున్ నే అవుతారని టాక్. ప్రస్తుతం రిలీజ్ చేసిన లుక్ విలన్ పాత్రకు సంబంధించినదని సమాచారం.
విలన్ లుక్‌తోనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన బన్నీ… ఇక హీరో లుక్ ఎలా ఉండబోతుందో అన్నది ఇప్పుడు ఫ్యాన్స్‌లో భారీ కుతూహలంగా మారింది.
అల్లు అర్జున్ 22వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో ఐదుగురు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి VFX కోసం ప్రముఖ సంస్థలు పనిచేస్తుండటంతో… “రాకా” సినిమా విజువల్‌గా కూడా ఓ కొత్త అనుభూతిని ఇవ్వబోతుందనే అంచనాలు మరింత పెరుగుతున్నాయి.








