Search
Close this search box.

  మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ..! పెద్ది ట్రీట్ రెడీ..!

March 25, 2026 10:08 PM | Aditya369 News

మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ..! పెద్ది ట్రీట్ రెడీ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి మేకర్స్ ఫ్యాన్స్‌కు పవర్ ఫుల్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఒకవైపు చరణ్ పుట్టినరోజు, మరోవైపు ‘పెద్ది’ గ్లింప్స్ విడుదలతో మెగా అభిమానుల ఆనందం డబుల్ అవుతోంది.

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో “ఇక మీ ఫీడ్ అంతా పెద్దిఫైడ్ అవుతుంది” అంటూ మేకర్స్ ఆసక్తి రేపారు. గేమ్ మొదలుకాబోతుందనే సంకేతంగా స్పోర్ట్స్ అరేనాను చూపిస్తూ, భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇదే పోస్టర్‌లో మూవీ రిలీజ్ డేట్‌ను మరోసారి కన్ఫర్మ్ చేస్తూ వాయిదా వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు.

మార్చి 27న గ్లింప్స్ రిలీజ్

మొదట ప్రకటించినట్టుగానే ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఇక మార్చి 27న ఉదయం 11 గంటల 07 నిమిషాలకు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పోస్టర్‌లో కనిపిస్తున్న కుస్తీ అరేనా చూస్తుంటే, ఈసారి రామ్ చరణ్ కుస్తీ నేపథ్యంలో అదిరిపోయే యాక్షన్ చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే గ్లింప్స్ చూసిన వారు ఇది మాస్ ట్రీట్ అవుతుందని చెబుతున్నారు.

రామ్ చరణ్ హెల్త్ అప్డేట్

ఇదిలా ఉండగా, షూటింగ్ సమయంలో రామ్ చరణ్ గాయపడ్డారనే వార్తలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన మేకర్స్—చరణ్‌కు పెద్దగా ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. ఎడమ కంటికి చిన్న గాయం కావడంతో మైనర్ సర్జరీ చేసినట్లు తెలిపారు. రేపటి నుంచే ఆయన మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని వెల్లడించారు. షూటింగ్ షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం లేదని, సినిమా పనులు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు.

హెల్త్ అప్డేట్‌తో ఊరట పొందిన ఫ్యాన్స్, ఇప్పుడు గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు