Search
Close this search box.

  మహావతార్ యూనివర్స్‌లో కొత్త సంచలనం – పరుశురామ్ రాబోతున్నాడు..!

April 19, 2026 6:02 PM | Aditya369 News

మహావతార్ యూనివర్స్‌లో కొత్త సంచలనం – పరుశురామ్ రాబోతున్నాడు..!

ఇటీవల కాలంలో యానిమేటెడ్ సినిమాల క్రేజ్ గణనీయంగా పెరిగింది. పెద్దలకే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఈ జానర్ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో హోంబేలే ఫిల్మ్స్ నీర్మించిన మహావతార నరసింహ సినిమా భారీ విజయాన్ని సాధించి యానిమేషన్ రంగంలో ప్రత్యేక ముద్ర వేసింది. 2025లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలతో పాటు ఇండస్ట్రీలో కొత్త దిశను చూపించింది.

ఈ విజయోత్సాహంతో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అదే మహావ పరుశురాం. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ధర్మం పతనమైనప్పుడు పరుశు గొడ్డలి లేస్తుంది” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

పురాణాల ప్రకారం, పరశురాముడు విష్ణు యొక్క ఆరవ అవతారం. అధర్మాన్ని నిర్మూలించడానికి అవతరించిన ఈ శక్తివంతమైన పాత్రను ఆధారంగా తీసుకుని దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ  చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2027 డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. పౌరాణిక కథలపై ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహావతార నరసింహ ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లడం ఈ ఫ్రాంచైజీకి మరింత గుర్తింపును తెచ్చింది.

ఇప్పటికే హోంబలె ఫిల్మ్స్ నుంచి వచ్చిన కేజీఎఫ్ సలార్, కాంతారా వంటి విభిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే మహావతార్ నరసింహ సుమారు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు మహావతార్ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న “పరుశురామ్” సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది రిలీజ్ తర్వాతే తేలుతుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు