Search
Close this search box.

  బాక్సాఫీస్ వద్ద ‘ఉస్తాద్’ జాతర.. మార్చి 26న విడుదల కానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

February 4, 2026 11:29 PM | Aditya369 News

బాక్సాఫీస్ వద్ద ‘ఉస్తాద్’ జాతర.. మార్చి 26న విడుదల కానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు గత కొన్నాళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. "అతడి రాకతో బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర మొదలవుతుంది" అంటూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సమ్మర్ హాలిడేస్ ప్రారంభాన్ని టార్గెట్ చేస్తూ ఈ తేదీని లాక్ చేయడం విశేషం.
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ మళ్లీ జతకడుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ తేదీకి రామ్ చరణ్ నటించిన 'పెద్ది' విడుదల కావాల్సి ఉండగా, బాబాయ్ పవన్ కల్యాణ్ సినిమా కోసం చరణ్ తన చిత్రాన్ని ఏప్రిల్ 30కి వాయిదా వేసుకున్నారు. దీంతో మార్చి చివరి వారంలో థియేటర్ల వద్ద పవర్ స్టార్ మాస్ పవర్ కనిపించబోతోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుండగా, రాశీ ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి, ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ బిజీగా ఉన్నప్పటికీ, షూటింగ్‌ను సకాలంలో పూర్తి చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు గత కొన్నాళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. “అతడి రాకతో బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర మొదలవుతుంది” అంటూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సమ్మర్ హాలిడేస్ ప్రారంభాన్ని టార్గెట్ చేస్తూ ఈ తేదీని లాక్ చేయడం విశేషం.

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ మళ్లీ జతకడుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ తేదీకి రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ విడుదల కావాల్సి ఉండగా, బాబాయ్ పవన్ కల్యాణ్ సినిమా కోసం చరణ్ తన చిత్రాన్ని ఏప్రిల్ 30కి వాయిదా వేసుకున్నారు. దీంతో మార్చి చివరి వారంలో థియేటర్ల వద్ద పవర్ స్టార్ మాస్ పవర్ కనిపించబోతోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుండగా, రాశీ ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి, ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ బిజీగా ఉన్నప్పటికీ, షూటింగ్‌ను సకాలంలో పూర్తి చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు