Search
Close this search box.

  ‘పెద్ది’లో జాన్వీ పాత్రపై రచ్చ.. వైరల్ అవుతున్న లీక్ చాట్స్..!

June 7, 2026 8:24 PM | Aditya369 News

‘పెద్ది’లో జాన్వీ పాత్రపై రచ్చ.. వైరల్ అవుతున్న లీక్ చాట్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్నా, మరోవైపు సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నాయి. విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు హీరోయిన్ పాత్ర చిత్రీకరణ విషయంలో విమర్శలను ఎదుర్కొంటోంది.

సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియ్యమ్మ’ పాత్రను కొన్ని సన్నివేశాల్లో అనవసరంగా గ్లామరైజ్ చేశారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొన్ని కెమెరా యాంగిల్స్‌పై ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పాత్రకు న్యాయం జరగలేదని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని చాట్ స్క్రీన్‌షాట్లు కొత్త చర్చకు దారితీశాయి. వాటి ప్రకారం, షూటింగ్ సమయంలోనే కొన్ని షాట్స్‌పై జాన్వీ కపూర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ఆ విషయంలో రామ్ చరణ్ తనకు మద్దతుగా నిలిచారని కూడా ఆ లీక్ అయిన సందేశాల్లో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చాట్స్ నిజమైనవేనా కాదా అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అలాగే జాన్వీ కపూర్, రామ్ చరణ్ తరఫున కూడా ఎలాంటి స్పందన వెలువడలేదు.

వివాదం మరింత చర్చనీయాంశం కావడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించారు. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నామని, ఎవరినీ అసౌకర్యానికి గురిచేయడం తమ ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. మహిళల పట్ల తనకు ఎల్లప్పుడూ గౌరవమేనని పేర్కొంటూ, ప్రేక్షకుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని సన్నివేశాలను రీ-ఎడిట్ చేయనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు, లీకైన చాట్స్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న కొన్ని వ్యాఖ్యలు కూడా ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. దీంతో ‘పెద్ది’ సినిమా విజయంతో పాటు, ఈ వివాదం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు