మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. ఆయన బ్యానర్లో ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు, అలాగే కల్ట్ క్లాసిక్ చిత్రాలు కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే. అలాంటి ప్రత్యేకమైన చిత్రాల్లో సూపర్ హిట్ లవ్ స్టోరీగా నిలిచిన “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” ఒకటి.
సిద్ధార్థ్ మరియు త్రిష జంటగా, ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి రికార్డు రన్ నమోదు చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ హిట్ జోడీ కలసి సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ప్రభుదేవా కాకుండా ఓ కొత్త దర్శకుడు ఈ క్రేజీ కాంబినేషన్‌ను హ్యాండిల్ చేయనున్నట్టు టాక్.
మరి దిల్ రాజు ఈసారి ఎలాంటి కథతో ఈ జోడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.








