మెగా హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొంతమంది హీరోలు షూటింగ్లలో బిజీగా ఉంటే, మరికొందరు కొత్త ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటూ, త్వరలో పూర్తికానుంది.
ఇదిలా ఉండగా… సాయి దుర్గ తేజ్ మరో కొత్త సినిమాకు కమిట్ అయినట్లు సమాచారం. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్స్ సుజీత్, సందీప్ కలిసి తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు.
ఇప్పటికే ఈ విషయంపై సాహూ గారపాటి తన అధికారిక X (ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ… మధ్యాహ్నం 12:06 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ సినిమా రొటీన్ కథ కాకుండా, కొత్త జానర్లో తెరకెక్కబోతుందని తెలుస్తోంది. షూటింగ్‌ను కూడా త్వరలో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? కథ ఏ జానర్లో ఉంటుంది? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ‘సంబరాల ఏటిగట్టు’ విషయానికి వస్తే… ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సాయి దుర్గ తేజ్ గత కొంతకాలంగా విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రమాదం తర్వాత ‘విరూపాక్ష’ సినిమాతో ఘన విజయం సాధించిన ఆయన… ఇప్పుడు మరింత జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేస్తున్నారు.
ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.








