Search
Close this search box.

  కన్నప్ప’ రీ రిలీజ్..! జూన్ 27న మళ్లీ బిగ్ స్క్రీన్‌పై..!

June 18, 2026 11:17 PM | Aditya369 News

కన్నప్ప’ రీ రిలీజ్..! జూన్ 27న మళ్లీ బిగ్ స్క్రీన్‌పై..!

భారీ తారాగణం, అద్భుతమైన విజువల్స్, పౌరాణిక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కన్నప్ప’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది.

భారీ కాస్టింగ్‌తో వచ్చిన ‘కన్నప్ప’

భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించగా, మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించారు. అంతేకాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటులు కూడా ప్రత్యేక పాత్రల్లో మెరిశారు.

అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ప్రశంసలు వచ్చాయి.. కానీ కలెక్షన్లు రాలేదు!

సినిమా విడుదలైన తర్వాత విజువల్స్, క్లైమాక్స్ ఎమోషన్స్, మంచు విష్ణు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో విష్ణు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.49 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

దాదాపు రూ.80 కోట్లకు పైగా బిజినెస్ జరిగిన ఈ చిత్రం చివరికి భారీ నష్టాలను మిగిల్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఏడాది తర్వాత రీ రిలీజ్

ప్రస్తుతం ‘కన్నప్ప’ ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ, థియేటర్లలో మరోసారి ప్రేక్షకులకు చూపించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

సినిమా విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్ 27న ‘కన్నప్ప’ను ఎంపిక చేసిన థియేటర్లలో ప్రత్యేకంగా రీ రిలీజ్ చేయనున్నట్లు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు.

తెలుగు ప్రేక్షకులు సినిమాకు చూపించిన ప్రేమ, క్లైమాక్స్‌కు వచ్చిన స్పందన దృష్ట్యా మరోసారి ఈ విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ను పెద్ద తెరపై అందించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

రీ రిలీజ్‌లో మ్యాజిక్ జరుగుతుందా?

ఇటీవల రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్‌లో మంచి ఊపులో ఉంది. పాత సినిమాలు కూడా రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘కన్నప్ప’ రీ రిలీజ్‌కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

స్ట్రెయిట్ రిలీజ్ సమయంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన ఈ చిత్రం.. రీ రిలీజ్‌లో అయినా కొత్త రికార్డులు సృష్టిస్తుందా? లేక మరోసారి సాధారణ స్థాయి స్పందనతోనే సరిపెట్టుకుంటుందా? అనేది చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు