Search
Close this search box.

  “కట్టప్ప బ్యాక్‌డ్రాప్‌ తో మరో విజువల్ వండర్..?” జక్కన్న క్రేజీ ప్లాన్..!

September 26, 2025 11:16 PM | Aditya369 News

“కట్టప్ప బ్యాక్‌డ్రాప్‌ తో మరో విజువల్ వండర్..?” జక్కన్న క్రేజీ ప్లాన్..!

బాహుబలి సినిమాల్లో కట్టప్ప పాత్రకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, “కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు?” అనే ప్రశ్నతోనే రెండో భాగం మొత్తం నడిపించిన రాజమౌళి, ఆ పాత్రను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపారు. సినిమాలో కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిసగా, ఒక ప్రత్యేక దళానికి అధిపతిగా కనిపిస్తాడు.

అయితే అసలు కథ ఏంటి? కట్టప్ప ఎందుకు బానిసగా మారాడు? అతని పూర్వీకులు ఎందుకు ఈ బాధ్యతలను అప్పగించారు? అనే విషయాలపై రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రత్యేకమైన స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ కథకు సంబంధించిన ప్రీ-విజువలైజేషన్ పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇక రాజమౌళి విషయానికి వస్తే — ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో బిజీగా ఉన్నారు. అందువల్ల కట్టప్ప సినిమాను ఆయనే డైరెక్ట్ చేస్తారా? లేక తన టీమ్‌లో మరో దర్శకుడికి ఈ బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నప్పటికీ, సినిమాగా రూపాంతరం చెందే అవకాశాలు మాత్రం బలంగానే కనిపిస్తున్నాయి.

బాహుబలి ఫ్రాంచైజ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా, కట్టప్ప బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సినిమా వస్తే ఆశ్చర్యం ఏమాత్రం లేదు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు